అబ్బాయిని పెళ్లిచూపులకి తీసుకువెళ్లారు అమ్మాయిని చూశాడు నచ్చింది అన్నాడు.. అంతా ఒకే అన్నారు, ఇక ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేశారు… ఇక ఆదివారం పెళ్లి అనగా ఆ పెళ్లి కొడుకు శనివారం జంప్ దీంతో అందరూ షాక్..
ఆ రోజు ఇంటికొచ్చి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తాపీగా చెప్పాడు.దీంతో వారు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
శనివారం వరుడి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అసలు ఏమైందా అని కంగారు పడ్డారు, మొత్తానికి ఎందుకు ఇష్టం లేదు అంటే తాను వేరే అమ్మాయిని ప్రేమించాను అనే మాట చెప్పాడు, ఇక ఇంట్లో పెద్దలు ఎంత చెప్పినా ఈ పెళ్లికి నో అన్నాడు, దీంతో అమ్మాయి తరపున వారికి ఈ విషయం చెప్పారు.
ఇలాంటి వార్త చెప్పడంతో అమ్మాయి తరపు వారు షాకయ్యారు… కానీ చేసేదేం లేక అంగీకరించారు. అమ్మాయి తరఫు వారు కట్నంగా ఇచ్చింది అంతా వెనక్కి ఇచ్చారు, అంతేకాదు పెద్దలు మరో తీర్మాణం పెట్టారు, అదనంగా ఆ అమ్మాయికి నగదు ఇవ్వాలి అని చెప్పారు, దీంతో వరుడు ఇస్తాను అని చెప్పాడట.