ఘట్కేసర్ బీ ఫార్మసీ విద్యార్థిని కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచనలం అయింది, తనపై రేప్ జరిగిందని తనని కిడ్నాప్ చేశారు అని పోలీసులకు తన కుటుంబ సభ్యులని తప్పుదోవ పట్టించింది ఈ స్టూడెంట్… చివరకు ఆమె ఆడిన నాటకం సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు పోలీసులు. - Advertisement -
అయితే నేడు ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.ఆమె నిన్న మధ్యాహ్నం సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కాని వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. రాత్రి ఇంటికి చేరుకుంది. కాని రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కూడా రాత్రి పడుకునే ముందు మళ్లీ నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది. తెల్లవారేసరికి విద్యార్థిని పరిస్థితి విషమించడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు.. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈనెల 10న తనకు కిడ్నాప్ చేశారని రేప్ జరిగిందని తన తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు ఆమెని సెల్ ఫోన్ నెంబర్ సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసి గుర్తించారు, కాని విచారణలో ఆమె నాటకం ఆడిందని తేలిపోయింది.
|
|
|
ఘట్కేసర్ బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య – అసలు ఏం జరిగిందంటే
-