దేశంలో ఓ వైపు పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి, ఇక డిజీల్ ధరలు ఆకాశాన్ని అంటాయి, ఒక్కో చోట ఏకంగా సెంచరీ కూడా దాటింది… ఇలా రేట్లు పెరగడంతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు, మధ్యతరగతి వారు చాలా మంది ఇక బండి బయటకు తీయడం కష్టం అంటున్నారు, ఇలా డీజీల్ పెట్రోల్ ధరలు పెరిగితే వాటి వల్ల నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి ఇప్పుడు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఇలా ఉంటే తాజాగా సామాన్యుడికి వంటగ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల షాక్ ఇస్తోంది. ఒకే నెలలో మూడు సార్లు వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఈసారి మరో 25 రూపాయలు పెరిగింది వంట గ్యాస్ ధర, చమురు కంపెనీలు తాజాగా ఈ ప్రకటన చేశాయి నేటి నుంచి ఈ కొత్త ధర అమలులోకి వస్తుంది.
ఈ నెల 4వ తేదీన సిలిండర్పై రూ.25 పెరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15వ తేదీన మరో రూ.50 పెరిగింది. ఇప్పుడు మరో 25 పెరిగింది ఇలా ఒకే నెలలో 100 పెరిగింది సిలిండర్ ధర.