నిజమే కొన్నిసార్లు ఇంట్లో ఆడవారి మాట వినాలి అంటారు…అవును వాటి వల్ల ఒక్కోసారి మనకు అదృష్టం కూడా కలిసి వస్తుంది, మంచి జరుగుతుంది, అయితే ఓ ఇల్లాలు కొన్న లాటరీ టికెట్ కు ఇప్పుడు కోటిరూపాయల లాటరీ తగిలింది. ఇదే ఇప్పుడు ఆ కుటుంబాన్ని చాలా ఆనందంలో ముంచెత్తింది.
తాజాగా పంజాబ్ ప్రభుత్వ లాటరీలో ఓ మహిళను ఊహించని విధంగా అదృష్టం వరించింది.
అమృత్ సర్ లో రేణూ చౌహాన్ కొన్నిరోజుల కిందట ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. తాజాగా ఆ టికెట్ కు కోటిరూపాయల లాటరీ తగిలింది, ఈనెల11న డ్రా తీశారు, దీంతో ఆమెకి ఈ ఫ్రైజ్ మనీ దక్కింది.
ఆమె కొన్న లాటరీ టికెట్ కు కోటి రూపాయల బహుమతి వచ్చింది. ఇక ఆ లాటరీ టికెట్ త్వరలోనే వారికి ఇవ్వనుంది, ఇలా లాటరీ తగలడంతో ఆమె చాలా ఆనందంలో ఉంది…రేణూ చౌహాన్ ఓ గృహిణి. ఆమె భర్త స్థానికంగా ఓ వస్త్రదుకాణం నిర్వహిస్తున్నారు. ఇక ఆమె కేవలం 100 రూపాయలు పెట్టి ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది.