FLASH NEWS – ప్లాట్ఫామ్ టిక్కెట్ ధర 50 రూపాయలు కీలక నిర్ణయం ఎక్కడంటే

-

ప్లాట్ఫామ్ టిక్కెట్ ధర పదిరూపాయలు ఉంటుంది అయితే ఫెస్టివల్ సమయంలో ఈ ధర 20 రూపాయలు ఉంటుంది అనేది తెలిసిందే, అయితే తాజాగా సెంట్రల్ రైల్వే షాకిచ్చింది. ప్లాట్ఫామ్ టిక్కెట్ ధరను 10 రూపాయల నుంచి ఏకంగా 50 రూపాయలకు పెంచింది. ముఖ్యమైన రైల్వే స్టేషన్లో ఈ ధరలు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయి. జూన్ 15 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

- Advertisement -

దీనికి కారణం కూడా ఉంది ఇప్పటికే కరోనా కేసులు మళ్లీ ముంబైలో పెరుగుతున్నాయి… ప్రధాన నగరాల్లో కేసులు నెమ్మదిగా పెరగడంతో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా స్టేషన్ ఫ్లాట్ ఫామ్ కి కేవలం రైలు ఎక్కేవారు మాత్రమే వస్తారు అని ఈ నిర్ణయం తీసుకున్నారు.

రద్దీ అనేది తగ్గుతుంది, కచ్చితంగా టికెట్ తీసుకుని ఎవరైనా వెళ్లాల్సిందే.ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, దాదర్ అండ్ లోకమాన్య తిలక్ టెర్మినస్తో పాటు థానే, కళ్యాణ్, పన్వేల్, బీవాండీ రైల్వే స్టేషన్లలో తాజాగా ఈ పెంచిన ధరలు అమలులోకి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...