దృశ్యం సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇక సంచలన విజయం నమోదు చేసింది ఈ సినిమా.. ఇక ఏ భాషలో రిలీజ్ అయినా ఈసినిమా సూపర్ హిట్ గా నిలిచింది…ఓ హత్య విషయంలో హీరో ఇంటిల్లిపాదీ ఒకే మాటపై ఉంటారు.. పోలీసుల విచారణలో అందరూ ఒకేమాటపై ఉంటారు…ఇలా ఈ కథకి ఎంతో హైలెట్ అయింది ఈ పాయింట్… ఇప్పటి వరకూ రాని స్టోరీ కావడంతో ఇటు ప్రేక్షకులకి బాగా నచ్చింది.
ఇక తాజాగా దృశ్యం 2 కూడా వచ్చింది… ఇది కూడా సక్సస్ అయింది.. మలయాళంలో వచ్చిన దృశ్యం2 చిత్రం ఇప్పుడు సూపర్ హిట్ గా నిలిచింది..ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది, మరి తెలుగులో కూడా దృశ్యం 2 కి సిద్దం అవుతున్నారు.
తెలుగులో దృశ్యంకు ప్రముఖ నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తే.. ఇప్పుడీ సీక్వెల్ కు మలయాళ మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా షూటింగ్ ప్రారంభం అయింది, ఇక 5 వ తేది నుంచి రెగ్యులర్ గా షూటింగ్ ఉంటుంది, పాత నటులు అందరూ ఇందులో నటిస్తారు.