ముక్కు అవినాష్ బుల్లితెరపై ఎంతో మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకున్నారు… ఇక జబర్దస్త్ నుంచి అతని ప్రయాణం ఎలా సాగిందో తెలిసిందే… కుటుంబ కామెడీ పండించే నటుడిగా అతనికి పేరు వచ్చింది… ఇక జబర్ధస్త్ నుంచి అతను ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యే స్దితికి చేరుకున్నాడు.
ఇక పలు సినిమాల్లోను నటించాడు అంతేకాదు ఇక ఈ సమయంలో బిగ్ బాస్ ఆఫర్ కూడా వచ్చింది, అక్కడ తన ఆటతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గర అయ్యాడు. బిగ్బాస్ నాలుగో సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌజ్లోకి వెళ్లిన అవినాష్ చివరి వరకూ కొనసాగాడు.
ఇక దాదాపు అతను మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్తో ఉన్న అగ్రిమెంట్ కోసం 10 లక్షలు పే చేశాను అని తెలిపాడు… స్నేహితుల దగ్గర అప్పు తీసుకున్నాను అని చెప్పాడు…. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన నగదుతో అతని అప్పు మొత్తం తీరిపోయింది…బిగ్బాస్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన అవినాష్ని స్టార్ మా వదులుకోలేదు. కామెడీ స్టార్స్ లో అవినాష్ రచ్చ రచ్చ చేస్తున్నాడు. డ్యాన్స్ రియాలిటీ షో డ్యాన్స్ ప్లస్లోనూ అవినాష్ మెరుస్తున్నాడు. ఇలా మరింత మంచి అవకాశాలు ఇక్కడ అందుకుంటున్నాడు అంటున్నారు అందరూ….. సో పాత షో దూరం అయినా స్టార్ మా జనాలకు అవినాష్ కామెడిని మరింత దగ్గర చేస్తోంది అని అనలిస్టులు అంటున్నారు…. ఇక పలు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయట.