అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నారు… ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. సుకుమార్ ఈ సినిమాని తీస్తున్నారు, ఇక ఇప్పటికే చాలా వరకూ అటవీ ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి అయింది.. మరో రెండు షెడ్యూల్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సిద్దం అయ్యారు, అల్లు అర్జున్ దీని తర్వాత ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక దీనిపై ప్రకటన ఇప్పటికే వచ్చేసింది.
ఇక ఆచార్య సినిమా చేస్తున్నారు కొరటాల.. ఈ సినిమా కూడా పూర్తి అయిన తర్వాత ఆయన బన్నీ చిత్రం పై ఫుల్ వర్క్ చేయనున్నారు, ఇప్పటికే స్టోరీ డవలప్ చేశారు, మరో నెల రోజుల్లో దీనిపై వర్క్ పూర్తి అవుతుంది, అయితే బన్నీతో ఆయన
తీసే సినిమాలో ముందు బన్నీ ఇందులో స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తారు, ఆ తర్వాత రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తారట.
ఇక తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇందులో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రను చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి… ఇక ఆమె ఇటీవల పలు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు, మొత్తానికి ఆమె ఈ సినిమాలో కీలక రోల్ చేస్తారు అని టాక్స్ నడుస్తున్నాయి.. టాలీవుడ్ లో దీనిపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. క్రాక్ – నాంది చిత్రాల్లో ఆమె నటించిన విషయం తెలిసిందే.