స్వీట్లు పంచి దొంగతనం చేశారు- జర జాగ్రత్త వీరి మోసం తెలిస్తే మతిపోతుంది

-

మిఠాయిలు పంచి దొంగతనం చేశారు ఓ జంట.. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన పెను సంచలనం అయింది.. సినిమాలో జరిగినట్లు నిజ జీవితంలో ఈ ఘటన జరగడంతో ఇంట్లో ఉండే వారు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయా అని భయపడిపోతున్నారు.
ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని బుట్టిగుడ వీధిలో జరిగింది ఇది..ఉషా పటేల్ అనే మహిళ ఇంట్లో సుభాష్ దంపతులు అద్దెకు ఉంటున్నారు.ఇక ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నా అని సుభాష్ చెప్పేవాడు.. ఇంటి వారు కూడా అదే అనుకునే వారు.. మాటలు కలిపి బాగా మాట్లాడేవాడు.. ప్రణాళిక ప్రకారం రెండు రోజుల క్రితం సాయంత్రం బయటకు వెళ్లి ఇంటికి స్వీట్లు పట్టుకొచ్చాడు.. మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది అని స్వీట్లు ఇచ్చాడు, అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడు..దీంతో ఆ స్వీట్లు తిన్న వారు మత్తులో జారుకున్నారు.ఇక ఇంటి ఓనర్ కే కాదు మిగిలిన మరో కొన్ని ఇళ్లల్లో వారికి ఇలా స్వీట్లు ఇచ్చారు అందరూ మత్తులో జారుకున్నారు.
రాత్రి 10 గంటలకు తన భార్యతో కలిసి సుభాష్ తమ యజమాని ఇంటిలో ఉన్న రూ.35 లక్షల విలువ చేసే బంగారంతో పాటు రూ.2.5 లక్షల నగదును తీసుకున్నాడు. ఇక మరో ఏడు ఇళ్లల్లో కూడా ఇలా చోరి చేసి ఇద్దరూ పారిపోయారు, మొత్తానిక మత్తు వదిలాక చూస్తే వీరు చేసిన మోసం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...