బెంగాల్ లో ఓ నవ వధువు తీసుకున్న నిర్ణయం పై అందరూ శభాష్ అంటున్నారు, ఇంతకీ ఆమె ఏం నిర్ణయం తీసుకుంది అంటే..ఈ 24 ఏళ్ల వధువు సంచలన నిర్ణయం తీసుకుంది…తనకు ఇచ్చే కట్నం వద్దంటూ… వాటి బదులు 60 పుస్తకాలు ఇవ్వాలంది. అందుకు వరుడు ఒప్పుకున్నాడు.. భాగల్పూర్ యూనివర్శిటీలో జాగ్రఫీ గ్రాడ్యుయేట్ గా ఆమె ఉన్నారు.
ఇక వీరి పెళ్లిని పెద్దలు కుదిర్చారు, అయితే తన నిర్ణయాన్ని ఆ సమయంలో వరుడికి చెప్పింది, అతని ఇంటి పెద్దలు కూడా ఒప్పుకున్నారు. సంప్రదాయంగా ఇచ్చే మొహర్ తీసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. ఇక ఆమె తీసుకున్న నిర్ణయం మంచికే కాబట్టి మాకు కూడా చాలా ఆనందం కలిగింది అని తెలిపారు.
ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే పెళ్లి తర్వాత వధువు తరపు కుటుంబ సభ్యులంతా పుస్తకాలతో కనిపించారు. ఆమెకు దాదాపు 80 పుస్తకాలు ఇచ్చారు. వాటిలో బెంగాలీ ఖురాన్, రవీంద్రనాథ్ ఠాకూర్, నజ్రుల్ ఇస్లామ్, విభూతిభూషణ్ బంధోపాధ్యాయ్ వంటి ప్రముఖుల రచనలు ఉన్నాయి. ఇక ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.