అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఇక లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు, వీరికి ఫ్రెండ్ సాయం చేశారు, ఇక బైక్ పై వెంటనే అందరూ కలిసి ఆలయానికి వెళ్లారు, అయితే అన్నీ కొనుక్కొని తాళిబొట్టు పూల దండలు అన్నీ తీసుకువస్తున్న సమయంలో గుడిదగ్గర ఉండాల్సిన అమ్మాయి కనిపించలేదు. దీంతో ఆ అబ్బాయి షాక్ అయ్యాడు. - Advertisement -
కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతి.. ప్రియుడితో కలిసి బైక్ ఎక్కింది. వారికి మరో ఇద్దరు ఫ్రెండ్స్ తోడు అయ్యారు, మొత్తానికి అందరూ కలిసి ఆలయానికి చేరుకున్నారు. అయితే ఆమె ఎందుకు ఎక్కడికి వెళ్లిందో తెలియలేదు, అయితే ఆమె అక్కడ నుంచి ఎస్కేప్ అయి ఇంటికి వెళ్లింది జరిగింది తల్లిదండ్రులకి చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు…తనను బలవంతంగా పెళ్లి చేసుకోబోయారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది, దీంతో అబ్బాయి అతని ఫ్రెండ్స్ షాక్ అయ్యారు, మొత్తానికి ఆమె మైనర్ కావడంతో ఆ యువకులపై కేసు నమోదు చేశారు విచారణ చేస్తున్నారు పోలీసులు.
|
|
|
గుడిలో పెళ్లికి ప్రేమ జంట ఏర్పాట్లు – చివర్లో అమ్మాయి ఎస్కేప్ ఏమైందంటే
-