మార్కెట్లోకి లగ్జరీ కార్లు వచ్చాయి అంటే చాలా మంది సెలబ్రెటీలు వాటిని కొనడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు…ఇక కొత్త మోడల్ అయితే వాటిని ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు.. ఇలా చాలా కంపెనీల కార్లను ఇప్పటికే మన దేశంలో ఎందరో సెలబ్రెటీలు తెప్పించుకున్నారు కోట్ల రూపాయల విలువ చేసే కార్లు వాడుతున్నారు, ఇక సినిమా రాజకీయ పారిశ్రామిక వేత్తలు బిజినెస్ స్పోర్ట్ పర్సెన్స్ ఇలా ఎన్నో లగ్జరీ కార్లు విదేశాల నుంచి తెప్పించుకున్నారు.
ఇక తాజాగా టాలీవుడ్ హీరోలు కూడా బడా కాంపెనీల కార్లు కొనుగోలు చేస్తున్నారు, తాజాగా జూనియర్ఎన్టీఆర్ ఓ లగ్జరీ కారు కొన్నట్లు తెలుస్తోంది.. ఇటలీకి చెందిన లాంబోర్గినీ తయారు చేసిన ఉరుస్ కారును కొన్నారట. ఇక ఇప్పటికే ఆర్డర్ అయింది ఇది త్వరలో ఇండియాకు రానుంది.
ఇది సూపర్ కారుగా చెబుతూ ఉంటారు దీని ధర కూడా అన్నీ ఖర్చులతో ఐదు కోట్ల రూపాయలు ఉంటుంది. సూపర్ స్పోర్ట్స్ కారుగా లాంబోర్గినీ పరిచయం చేసింది ఈ కారుని, ఇక ఈకారు ఎంతో ఇష్టంతో తారక్ కొన్నారట.