మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారు అని ఎన్నో రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక అనేక సార్లు దానిని ఆయన ఖండించారు.. ఇందులో వాస్తవం లేదు అన్నారు, తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నా అని తెలిపారు.
అయితే తాజాగా నేడు ఆయన ప్రధాన అనుచరుడు వైసీపీలో చేరారు.. ఈ సమయంలో వైసీపీ ఎంపీ
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు..
దీనిపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. తనపై ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదని తెలిపారు.
ఇక గత ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి వార్తలు అనేకం వినిపించాయి.. ఇక ఇలాంటి వార్తలు 100 సార్లు వచ్చాయి.. ఏకంగా డేట్లు కూడా చెప్పేశారు.. ఓసారి బీజేపీ అంటారు మరోసారి వైసీపీ అంటారు.. ఇలా అనేక వార్తలు తనపై వచ్చాయి.. తాను వాటిని ఖండిస్తూనే ఉన్నానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడుతూ తాను ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు అని.. మరి ఆ ప్రతిపాదనలు ఏమిటో విజయసాయిరెడ్డి తెలపాలి అని అన్నారు.