పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా ప్రమాదం.. వారికి తెలిసీ తెలియక చేస్తారు కొన్ని పనులు… పాపం ఒక్కోసారి ప్రమాదాల్లో పడతారు.. అందుకే పిల్లలని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది…12వ అంతస్తు నుంచి ఓ చిన్నారి అమాంతం కిందపడింది.. ఈ వీడియో చూసి జనాలు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
వియత్నాంలోని హనోయ్‌లో ఉన్న ఓ భవనంలోని 12వ అంతస్తు కిటికీ నుంచి చిన్నారి బయటకు వచ్చింది. బయటకు వచ్చాక ఆ చిన్నారి ఏడ్చింది, ఇక ఆమెని రక్షించాలి అని అనుకున్నా ఆపాప ఎడ్జ్ చివర ఉంది, ఇక ఇంటి నుంచి గట్టిగా అరుపులు రావడంతో భవనం కింద ఏదో పనిపై ఎదురుచూస్తున్న గుయెన్ గోక్ మాన్ష్ ఆ అరుపులు విన్నాడు.
వెంటనే పై నుంచి పాప పడిపోతుంది ఏమో అని భయపడ్డాడు.. చివరకు అదే జరిగింది.. నిమిషంలోనే పాప పై నుంచి కింద పడిపోయింది.. అయితే ఆమెని పట్టుకోవడానికి ఓ మెటల్ కప్పుని ఎక్కాడు.. అక్కడ పాపని పట్టుకున్నాడు.. ఈ సమయంలో అతనికి గాయాలు అయ్యాయి.. ఈ వీడియో ఇప్పుడు పెను వైరల్ అయింది.
ఈ వీడియో మీరు చూడండి