మనకు వచ్చే ఆదాయం జీతం బట్టీ మన ఖర్చు ఉంటుంది, ఎక్కువగా రెంట్లకు చాలా మంది ఖర్చు చేస్తూ ఉంటారు.. తమ జీతంలో సగం ఇంటి అద్దెకు ఖర్చు అవుతోంది అని చెప్పేవారు ఉంటారు, ఇక బాగా సంపాదన ఉన్నవారు అయితే సొంత ఇళ్లులు కూడా నిర్మించుకుంటారు..మహా అయితే అద్దె ఎంత ఉంటుంది 5 వేలు ఇంకా క్లాస్ అయితే 10 వేల నుంచి 50 వేల వరకూ ఉంటుంది.
ఇక విల్లాలు లగ్జరీ హౌస్ లు అయితే రెండు లక్షల వరకూ ఉంటాయి.. కానీ ఇక్కడ అద్దె వింటే షాక్ అవుతారు..
హాంగ్‌కాంగ్‌లోని ఓ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి అద్దె అక్షరాలా.. 1.26కోట్లు.. బాబోయ్ ఏమిటి ఇంత రేటా.. అద్దె లేక కొనడానికి అని అనుకుంటున్నారా అది నిజంగా అద్దె మాత్రమే.
ఇంటి ప్రత్యేకతలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి.. ఇందులో ఉన్న స్పెషాలిటీ తెలిస్తే ఇంత పెట్టినా పర్వాలేదు అనిపిస్తుంది..ఈ ఇల్లు మొత్తం 10,804 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఇంట్లో.. ఓ ప్రైవేట్ గ్యారేజ్, లిఫ్టు కూడా ఉన్నాయి.ఇంట్లోనే తోట ఉంది ఇక అన్నీ సౌకర్యాలు ఉంటాయి.. నేరుగా రోడ్డుమీదకు కారు వెళుతుంది.. మళ్లీ లీఫ్ట్ నుంచి మీ బెడ్ రూమ్ కు వెళ్లవచ్చు, ఇది అమ్మరు కేవలం రెంట్ కు మాత్రమే ఇస్తారు.
|
|
|
ఇక్కడ ఇంటి అద్దె ఎంతో తెలిస్తే మతిపోతుంది – ఏకంగా కోట్లలో అద్దె
-