విమానం బయలుదేరే ముందు అన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు అనే విషయం తెలిసిందే.. ఇంజిన్ నుంచి కాక్ పీట్ అలాగే ప్రయాణికులు కూర్చోని సీట్లు ఇలా అన్నీ చెక్ చేసిన తర్వాత లోపలికి పాసింజర్లు వస్తారు, అంత జాగ్రత్తలు భద్రత ఉంటాయి, అయితే ఎలా వచ్చిందో తెలియదు కాని ఓ పిల్లి నేరుగా విమానంలోకి వచ్చేసింది.. ఇక రెచ్చిపోయి ఏకంగా పైలెట్ పైనే దాడి చేసింది.
ఏకంగా కాక్‌పిట్‌లో దూరి పైలట్‌పైనే దాడి చేసి ముప్పుతిప్పలు పెట్టింది. ఇక దాని బాధ తట్టుకోలేక విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సూడాన్ లో ఈ ఘటన జరిగింది, ఇక్కడ ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతార్ రాజధాని దోహాకు వెళ్లవలసిన ఈ విమానం అంతా సిద్దం అయి టేకాఫ్ అయింది.. అయితే గాలిలో ఉన్న సమయంలో పిల్లి హాడావిడి చేసింది.
ఈ పిల్లి విమానంలోకి ఎలా వచ్చిందో తెలియదు గానీ కాక్‌పిట్‌లో పైలెట్, సిబ్బందిపై దాడి చేసింది. చివరకు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.. దానిని బయటక పంపిన తర్వాత మళ్లీ విమానం బయలుదేరింది. ప్రయాణికులు అందరూ క్షేమంగానే ఉన్నారు…రాత్రి విమానాశ్రయంలో విమానంలోకి పిల్లి వచ్చి ఉంటుంది అని, హ్యాంగర్ దగ్గర హాల్ట్‌లో ఉన్న సమయంలో ఇది వచ్చి ఉంటుంది అని భావిస్తున్నారు అక్కడ సిబ్బంది.
|
|
|
విమానంలో పిల్లి రచ్చ రచ్చ – ఏకంగా పైలట్ పై దాడి – చివరకు ఏం చేశారంటే
-