బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి.. గడిచిన నెల రోజుల నుంచి చూస్తే పుత్తడి 15 శాతం తగ్గింది.. వెండి 21 శాతం ధర తగ్గింది, అయితే తాజాగా చూస్తే ముంబై బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గాయి. వెండి భారీగా తగ్గింది.. రెండు రోజులక్రితం ఒక్కరోజు ఏకంగా 1000 తగ్గిన బంగారం నిన్న కాస్త పెరిగింది.. ఈరోజు మళ్లీ తగ్గుముఖం పట్టింది.. సో బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయి అనేది ఓ లుక్కేద్దాం..
హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.700 తగ్గింది. దీంతో రేటు రూ.45,600కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది..650 తగ్గడంతో
రూ.41,800కు చేరింది, నిన్నటి మీద బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
బంగారం ధర తగ్గితే .. వెండి రేటు కూడా తగ్గింది. వెండి ధర కేజీకి రూ.2400 తగ్గింది. దీంతో రేటు రూ.70,400కు చేరింది.. వచ్చే రోజుల్లో వెండి బంగారం ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయంటున్నారు నిపుణులు… దాదాపు గత ఏడాది ఆగస్టులో 59 వేలకు బంగారం ధర చేరిన విషయం తెలిసిందే.