సినిమా షూటింగులు చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి నటులు.. కొన్ని యాక్షన్ సీన్లు చేసే సమయంలో రిస్క్ షూట్లు ఉంటాయి.. ఇవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేస్తారు.. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ చేసే సమయంలో కొందరు స్టంట్ మాస్టర్లను అలాగే డూప్ లని కూడా వాడతారు, కాని గతంలో ఎక్కువగా వీరిని వాడేవారు, కాని నేటి తరం నటులు డూబ్ లకి ఇష్టంపడటం లేదు.. రిస్క్ ఎంత ఉన్నా వారే నటిస్తున్నారు.
ఇలాంటి సమయాల్లో కొన్నిప్రమాదాలు జరిగాయి…మరి తాజాగా ఇలా ఓస్టార్ హీరో గాయాలపాలయ్యాడు.. షూటింగ్ లో భాగంగా జరిగిన ప్రమాదంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కు తీవ్ర గాయమైంది.. మలయన్ కుంజు అనే సినిమా చేస్తున్నారు ఆయన.. ఈ సమయంలో ఇంటి సెట్ నిర్మించారు అది కూలి పోతున్న సమయంలో ఆయన బయటపడాలి..
అయితే ఆయన బయటకు వచ్చే క్రమంలో కాస్త పట్టుతప్పి అందులోనే పడిపోయారు…ఫాజిల్ ముక్కుకు పెద్ద గాయమైంది వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు, ఇక ప్రమాదం లేదు అని వైద్యులు చెప్పారు, ఈ వార్త తెలిసి అందరూ కూడా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు.