రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ తీసుకునే వెళతాం.. ఎవరిని అయినా ట్రైన్ ఎక్కించడానికి వెళ్లినా లేదా ఎవరిని అయినా రిసీవ్ చేసుకోవడానికి వెళ్లినా ఇలా టికెట్ తీసుకుంటాం, అయితే దేశంలో ఈ టికెట్ ధర 10 రూపాయలు మాత్రమే ఉంది.. కాని తాజాగా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాట్ఫాం టికెట్ ధర భారీగా పెంచారు.
రైల్వేశాఖ ఒకేసారి రూ.20 పెంచి ఆ టికెట్ ధరను రూ.30గా నిర్ణయించింది. వెంటనే ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి, ఇక అన్నీ జోన్లు ఇది పాటిస్తాయి, ప్లాట్ఫాం టికెట్ తీసుకున్న వారు రెండు గంటల పాటు ప్లాట్ఫామ్పై ఉండవచ్చు. అంతేకాదు లోకల్ రైళ్ల టికెట్ ధరలు కూడా పెరుగుతున్నాయి.
లోకల్ రైళ్లలో కనీస చార్జీ రూ.30గా నిర్ణయించారు. ఇక దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి ఈ సమయంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక స్టేషన్లో రద్దీ తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది అందుకే టికెట్ ధరలు పెంచారు.
లోకల్ రైళ్లు, ప్లాట్ఫాంపై ఎక్కువ మందిని ప్రోత్సహించకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది రైల్వేశాఖ.