సినిమా సక్సెస్ అయితే చాలా మంచి అవకాశాలు వస్తాయి హీరో హీరోయిన్ కి.. అలాగే వరుసగా సినిమా ఆఫర్లు వస్తాయి.. నటీనటులకి మంచి సినిమా అవకాశాలు రావడంతో పాటు దర్శకుడికి పలు అవకాశాలు వస్తాయి.. టాలీవుడ్ లో విడుదలై ఘన విజయం సాధించిన ఉప్పెన సినిమా కూడా మంచి వసూళ్లు సాధించింది.. వైష్ణవ్ తేజ్ కు మంచి ఫేమ్ తెచ్చింది, తొలి సినిమాతో ఘన విజయం తన ఖాతాలో వేసుకున్నాడు.
హీరోయిన్ గా నటించిన బ్యూటీ కృతిశెట్టి పలు ఆఫర్లు అందుకుంటోంది.ఇక పలు కధలు వింటోంది ఆమె, తాజాగా నాని సరసన శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.. ఇక తాజాగా
రామ్ పక్కన నటించే అవకాశం కూడా దక్కించుకుంది.
ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా వస్తోంది ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది, ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆమెకి వెల్ కం చెబుతూ పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్.