తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా చిత్రసీమకు పరిచయమైంది వరలక్ష్మి …. ఆమె నటనతో ప్రేక్షకులని ఇట్టే కట్టిపడేస్తోంది, అద్బుతమైన పాత్రలు ఒప్పుకుంటూ ఇటు తెలుగు తమిళ చిత్ర సీమలో మంచి నటిగా గుర్తింపు పొందింది, విలనిజం పాత్రలతో ఆమె బాగా దగ్గర అయింది అభిమానులకి.
తెలుగు తమిళ్ లో ఇప్పుడు ఫెరోషియస్ క్యారెక్టర్లకు ఆమె కొత్త చిరునామాగా మారింది. క్రాక్…నాంది సినిమాలలోని పాత్రలలో ఆమె ప్రదర్శించిన అభినయం అందరికి నచ్చింది… అంతేకాదు ఇక చాలా మంది మన తెలుగు దర్శకులు ఆమెకి పలు కధలు వినిపిస్తున్నారట.
స్టార్ హీరోలకు దీటుగా వుండే పాత్రలను కూడా ఆమెకు ఆఫర్ చేస్తున్నారు. కొరటాల బన్నీ సినిమాలో ఆమె నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి …కాని దీనిపై ఇంకా ప్రకటన రాలేదు, ఇక తాజాగా ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించే సినిమాలో ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్ర కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. సో చూడాలి దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.
ReplyForward
|