సెలబ్రిటీలు విలాసవంతమైన జీవితం గడుపుతారు అనేది తెలిసిందే, అంతే కాదు లగ్జరీ కార్లు గాడ్జెట్స్ ఇలా ఖరీదైన బట్టలు వాచీలు వాడుతూ ఉంటారు, ఇక షూటింగులు లేకపోతే విదేశాలకు టూర్ల వెళతారు, ముఖ్యంగా చాలా మంది హీరోలు హీరోయిన్లు షూటింగ్స్ కోసం ఔట్డోర్కు వెళ్ళినప్పుడు వారికి సకల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా కార్వ్యాన్ను ఏర్పాటు చేసుకుంటారు.
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది హీరోలు ఇలా కార్ వ్యాన్ తయారు చేయించుకున్నారు, మన టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇటీవల దీనిని తయారు చేయించుకున్న విషయం తెలిసిందే.. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అన్ని హంగులతో కార్వ్యాన్ను సిద్ధం చేయించుకున్నాడట.
ఇక ప్రిన్స్ కు సంబంధించి కార్ వ్యాన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు మహేష్, ఇక ఆయన ఎంతో ఇష్టపడి తనకు నచ్చిన విధంగా ఇది తయారు చేయించుకుంటున్నారట. ఈ ఫోటోలు మీరు చూడవచ్చు.