పెళ్లి చేసుకుని పుట్టినింటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్తుంటే.. ఏ అమ్మాయికైనా బాధ వస్తుంది.. అప్పటి వరకూ తల్లిదండ్రులు అన్న,చెల్లెలు,తమ్ముడు, అక్క అందరితో ఉండి కొత్త వ్యక్తితో జీవితంలోకి వెళుతుంది.. ఈ సమయంలో వివాహం తర్వాత అప్పగింతలు ఉంటాయి.. ఇక ఆ సమయంలో కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తాయి.. ఇది ఎవరికి అయినా జరిగేదే.. ఆ సమయంలో అందరూ బాధపడుతూ ఉంటారు.
ఒడిశాలోని బాలానగర్ జిల్లా తెటెల్ గావ్ కు చెందిన బిశికేశన్ అనే యువకుడితో గుప్తేశ్వరి సాహూ అలియాస్ రోసీ సాహూకు
వివాహం జరిగింది.. ఈ సమయంలో అత్తవారి ఇంటికి వెళ్లే సమయంలో అప్పగింతలు అయ్యాయి, అయితే ఎంతో వెక్కి వెక్కి ఏడ్చింది పెళ్లికూతురు.
చివరకు నీరసించిపోయి కుప్పకూలిపోయింది. వెంటనే ఆ అమ్మాయిని స్పృహలోకి తెచ్చేందుకు కుటుంబ సభ్యులు, ప్రయత్నించినా ఫలితం లేదు. ఆమె అలాగే ఉండిపోయింది.. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు.. కాని ఆమె చనిపోయింది అని వైద్యులు తేల్చారు. దీంతో ఇరుకుటుంబాల్లో విషాదం నెలకొంది.