ఓ విషయం గుర్తు ఉంచుకోవాలి బాత్రూమ్ కు వెళ్లిన సమయంలో మల విసర్జన చేస్తున్న సమయంలో అసలు దేనిమీద ఆలోచన చేయకుండా దానిమీద మాత్రమే ఫోకస్ పెట్టాలి.. అప్పుడు మాత్రమే అది సాఫీగా జరుగుతుంది.. లేకపోతే మలబద్దక సమస్య వస్తుంది,. కొందరు నీరు తక్కువ తాగుతారు ఫైబర్ ఫుడ్ తీసుకోరు వారికి చాలా సమస్యలు వస్తాయి, అయితే ఈరోజుల్లో చాలా మంది బాత్రూమ్ కు వెళ్లిన సమయంలో సెల్ ఫోన్ కూడా తీసుకువెళుతున్నారు.. ఇది చాలా మందికి అలవాటుగా మారుతోంది.
ఇలా చేస్తే చాలా రకాల వ్యాధులు వస్తాయి ముఖ్యంగా మలబద్దకంతో పాటు అనేక రకాల బ్యాక్టిరీయాలు ఆ మొబైల్ కి చేరుతాయి.. అక్కడ నుంచి మీరు చేతులతో తాకితే శరీరంలోకి చేరతాయి అనేక రకాల జబ్బులకి కారణం అవుతాయి.
మీరు ఫ్లష్, పైపులు పుట్టుకుని మళ్లీ ఫోన్లను ముట్టుకొనేప్పుడు ఇది జరుగుతుంది. సాల్మొనెల్లా, ఇ. కోలి, సి.డిఫిసీలే వంటి చాలా రకాల జబ్బులు కలిగింగే బ్యాక్టిరీయాలు ఉంటాయట.
మీరు ఇలా ఫోన్ చూస్తు బాత్రూమ్ కు వెళితే పాయువుపై ఒత్తిడి పడుతుంది. దీని వల్ల మూల శంఖ వ్యాధి వస్తుంది, సో ఈజీగా సుఖ విరోచనం అయ్యేలా చూసుకోవాలి అంటే నీరు తాగి బాత్రూమ్ కి వెళ్లండి పేపర్ ఫోన్లు తీసుకువెళ్లవద్దు.8 నుంచి 10 నిమిషాల్లో బాత్రూమ్ లో నుంచి వచ్చేలా చూసుకోవాలి చేతులు కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి.