సినిమా నటులు రాజకీయాల్లోకి చాలా మంది వచ్చారు.. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ అలాగే తమిళనాడులో ఇలా చాలా మంది వచ్చారు.. ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు కేంద్రమంత్రులు అయ్యారు, ఇక ఇప్పుడు తమిళనాట ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సమయంలొ ఇక్కడ సినిమా నటులు చాలా మంది ఎన్నికల్లో పోటికి సిద్దం అవుతున్నారు..
ముఖ్యంగా డీఎంకే ఈసారి అధికారంలోకి రావాలి అని తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.. అలాగే విజయకాంత్.. ఎండీఎంకే తో ముందుకు వస్తున్నారు, అలాగే కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు, ఇక కరుణానిది కుటుంబం నుంచి ఆయన కుమారుడు స్టాలిన్ ఉన్నారు… అలాగే ఆయన కుమారుడు కరుణానిధి మనవడు ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.
చెన్నెలోని చెపాక్ నియోజకవర్గం నుంచి డీఎంకే తరపున పోటీ చేస్తున్నాడు. పార్టీ యువజన సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన, యువతలో చైతన్యం నింపుతున్నారు, తాజాగా ఆయన పార్టీకి ప్రధాన కార్యాలయమైన అణ్ణా అరివాలయానికి హాజరయ్యాడు…పార్టీ సీనియర్లు నేతలు అందరూ ఉదయనిధిని ఇంటర్వ్యూ చేసారు …పార్టీ అధ్యక్షుడు, ఉదయనిధి తండ్రి స్టాలిన్, ప్రధాన కార్యదర్శి దురై మురుగన్. అతనికి అన్నీ అర్హతలు ఉన్నాయా అని ఇంటర్వ్యూ చేశారు, ఇక టికెట్ కన్ఫామ్ చేశారు.