మన టాలీవుడ్ చిత్ర సీమలో ఎందరో కమెడియన్లు ఉన్నారు… అసలు దేశంలో ఉన్న చిత్ర సీమల్లో అత్యధిక కమెడియన్లు ఉన్న చిత్ర సీమ మన తెలుగు చిత్ర సీమ… దాదాపు 100 మంది కమెడియన్లు ఉంటారు, ఇక సినిమాల్లో కామెడీ పాత్రలకు ఎంత పేరు వస్తుందో తెలిసిందే, ఇక పాత తరం కమెడియన్లో కచ్చితంగా చెప్పుకోవలసిన వ్యక్తి ఒకరు ఉన్నారు ఆయనే కళ్ళు చిదంబరం..
ఎన్నో అద్బుతమైన చిత్రాలు చేశారు ఆయన… తొలి సినిమాలో పాత్రతో ఆయన చిదంబరం అనే పేరుకి ముందు కళ్లు అనే బిరుదు వచ్చేసింది.
1988 వ సంవత్సరం లో కళ్ళు అనే సినిమా ద్వారా వెండితెర కి పరిచయం అయ్యారు.. అక్కడ నుంచి ఆయనకు కళ్లు చిదంబరం అనే పేరు ఉండిపోయింది. దాదాపు 30 చిత్రాల్లో నటించారు, 2015 లో అనారోగ్యంతో ఆయన మరణించారు. ఇక ఆయన గురించి చూస్తే ఆయన చిత్ర సీమలో సినిమాలు చేస్తూ మరో పక్క ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు.
పగలు పూట ఉద్యోగం చేస్తూ,రాత్రుల్లో నాటకాల్లో పాల్గొనేవారు..అమ్మోరుకి బొట్టు పెట్టమ్మా అనే డైలాగ్ అమ్మోరు సినిమాలో ఆయనకు ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే… ముందు ఉద్యోగానికి తర్వాత నాటకాలు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఆయన..అయితే ఆయనలో ఎంతో సేవా గుణం ఉంది.. సినిమాలు నాటకాల ద్వారా వచ్చే నగదుని పేద కళాకారులకి ఖర్చు చేసేవారు… తన ఉద్యోగం నుంచి వచ్చే నగదుతో కుటుంబాన్ని పోషించేవారు.. ఆయనకు ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు పిల్లలకు మంచి విద్యని అందించారు.