శివుడు అభిషేక ప్రియుడు.. ఆయనను మనం స్మరించుకుని చెంబుడు నీరు అభిషేకంగా పోసినా ఆయన ఎంతో ఆనందిస్తారు, అంతేకాదు ఆయన ఎలాంటి కోరిక కోరినా తీరుస్తారు భక్తిశ్రద్దలతో ఆయనని పూజించుకుంటే అంతా మంచే జరుగుతుంది. లయకారునికి వివిధ ద్రవ్యములతో అభిషేకం చేస్తారు. మరి వేటితో చేస్తే మంచిది ఏఏ ఫలితాలు అనేది చూద్దాం.
ఎక్కువగా జలంతో ఆవుపాలతో ఆయనకు అభిషేకం చేస్తారు ఇవి ఆయనకు ఎంతో ఇష్టం ఇక ఇలా చేస్తే ఆ కుటుంబానికి సర్వ సుఖాలు – అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
పెరుగుతో అభిషేకం చేస్తే వారికి ఆరోగ్యం ఉంటుంది.
ఇక ఆవు నెయ్యితో చేస్తే ధనలక్ష్మీ వారి దగ్గర నిలుస్తుంది, ఆ శివుడి ఆశీస్సులు ఉంటాయి.
చెరుకు తేనేతో చేస్తే ధనం చేతిలో నిలువ ఉంటుంది.
కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను ఇస్తాడు ఆ శివుడు.
పుష్పాలతో పూజించినా అభిషేకం చేసినా భూములు కలుగుతాయి అంటే భూలాభం ఉంటుంది.
మెత్తని చక్కరతో అభిషేకించిన దుఃఖం నుంచి విముక్తి వస్తుంది.
మారేడు బిల్వ పత్రం దీనితో చేస్తే ఎంతో ధనలాభం కలుగుతుంది.