మన దేశంలో పెట్రోల్, గ్యాస్ డిజీల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి… ధరలు చూస్తే సెంచరీలు దాటేస్తున్నాయి… ఇక ఈ ఎఫెక్ట్ నిత్యావసర వస్తువులపై కూడా పడుతోంది.. రవాణా ఖర్చులు పెరిగి ఆ ధరలు కూడా పెంచుతున్నారు. ఇక మధ్యతరగతి ప్రజలు బతుకు బండి ఎలా లాగాలా అని మదనపడుతున్నారు. ఇక మన దేశంలో ధరలు ఇలా ఉన్నాయి పక్క దేశం పాకిస్తాన్ లో కూడా ధరలు మరింత దారుణంగా ఉన్నాయి.
పాకిస్తాన్లో నిత్యావసర ధరలు చుక్కలనంటుతున్నాయి. పాకిస్తాన్లో ద్రవ్యోల్పణం తారా స్థాయికి చేరింది. ఇక ఆదాయం పెంచడమే లక్ష్యంగా అక్కడ పన్నులు వేస్తున్నారు, దీంతో అక్కడ ఏకంగా ఓ కోడి గుడ్డు 30 రూపాయలకు అమ్ముతున్నారు, ఇక డజన్ గుడ్లు 360 అంటే చూడండి ఎలా ఉందో.
రావల్పిండిలో డజన్ గుడ్ల ధర రూ.350 పలుకుతోంది…అంతేకాదు కిలో అల్లం ధర పాకిస్తాన్లో ఏకంగా రూ.1000కి చేరినట్లు
వార్తలు వినిపిస్తున్నాయి, పెరిగిన ధరలు తగ్గించాలి అని కోరుతున్నారు జనం.. అయితే షుగర్ మాత్రం చాలా తక్కువగా ఉంది.. కిలో 100 నుంచి 80 కి వచ్చింది… ఇక చికెన్ ధర కిలోకు రూ. 370, మటన్ రూ.900లకు కిలో చేరింది.
ReplyForward
|