ప్రపంచ కుబేరుల్లో రెండోస్థానంలో ఎలన్ మస్క్ ఉన్న విషయం తెలిసిందే, ఇటీవల ఆయన సంపద ఆవిరి అయింది..
ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకున్నారు, అయితే మళ్లీ వారాలు తిరక్కుండానే ఫుల్ స్పీడ్ లో సంపద పెరిగింది.
ఒకే రోజు ఆయన సంపాదన ఏకంగా 1.82 లక్షల కోట్లు 2500 కోట్ల డాలర్లు పెరగడం విశేషం. అయితే ఆయన కంపెనీ బంగారు బాతు అనే చెప్పాలి.
షేర్ వాల్యూ భారీగా పెరిగింది, టెస్లా షేర్ 20 శాతం పెరగడంతో మస్క్ మరింత రిచ్ అయ్యారు, ఇక ఆయన సంపద మొత్తం చూసుకుంటే 12.70 లక్షల కోట్ల డాలర్లుకు చేరింది. ఇక దాదాపు అమెరికన్ కంపెనీలు అన్నీ కూడా ఫుల్ బూస్ట్ లో ఉన్నాయి.
అన్నీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఆపిల్, అమెజాన్, ఫేస్బుక్లాంటి టెక్ కంపెనీల షేర్లు లాభపడటంతో నాస్డాక్ రాత్రికి రాత్రి 3.7 శాతం లాభపడింది. అంతేకాదు అమెజాన్ షేర్ వాల్యు కూడా పెరిగింది, దీంతో అధినేత బెజోస్ కూడా నిన్న ఒక్క రోజు 600 కోట్ల డాలర్లు సంపాదించారు …ఇక వీరిద్దరి మధ్య ఇలా సంపద పెరగడం తగ్గడంతో కొన్ని రోజులు ఒకరు మరికొన్ని రోజులు ఒకరు.. ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు అంటున్నారు బిజినెస్ అనలిస్టులు.