గ్యాస్ వాడే ప్రతీ ఒక్కరు ఈ వార్త చదవాలి – ఈ జాగ్రత్తలు తీసుకోండి 

-

ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటోంది, అయితే దీనిని వాడే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. మరి వాటిని పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగవు అంటున్నారు, మీరు వంట చేస్తున్న సమయంలో లేదా గ్యాస్ ఆపినా సరే గ్యాస్ లీకేజీ
వాసన వస్తే వెంటనే కిటీకీలు తలుపులు తీయాలి, ఎలాంటి ఫైర్ వెలిగించకూడదు  లైట్లు ఆపివేసి ఉంచాలి.
ఈ సమయంలో ఫ్యాన్ వేయడం ఏసీ వేయడం వంటివి చేయొద్దు. గాలి, వెలుతురు వచ్చే విధంగా చూడాలి. ఒకవేళ మంట వస్తూ ఉంటే దానిని విసిరివేయకూడదు.. గ్యాస్ రెగ్యులేటర్ ని ఆపేయాలి.. కింద వేయడం వల్ల మంట ఇంకా పెరుగుతుంది..
సిలిండర్ను ఎప్పుడూ నిలువుగానే ఉంచాలి. స్టౌవ్ను ఎప్పుడూ సిలిండర్ కంటే ఎత్తులోనే ఉంచాలి. కింద నేలపై గ్యాస్ స్టవ్ పెట్టవద్దు.
ఇక ఒకే రబ్బర్ ట్యూబ్ ఉండాలి అటాచ్ లు ప్యాచ్ లు చేయకూడదు ..ఇది చాలా డేంజర్, కచ్చితంగా రబ్బర్ ట్యూబ్ ఏడాది లేదా రెండు ఏళ్లుకి ఓసారి మార్చుకుంటే మంచిది….రాత్రి కచ్చితంగా స్టవ్ బర్నర్ స్విచ్లు ఆఫ్చేయాలి. రెగ్యులేటర్ స్విచ్ నాబ్ పోకుండా చూసుకోవాలి, ఇక ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే గ్యాస్ ఏజన్సీకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...