కేజీఎఫ్ సినిమాకి ఎంత ఫేమ్ వచ్చిందో తెలిసిందే.. ఒక్క సినిమాతో ఇటు దర్శకుడు ప్రశాంత్ ని కూడా చాలా మంది హీరోలు మంచి స్టోరీలు చెప్పమంటున్నారు…భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తాము అని నిర్మాతలు ముందుకు వస్తున్నారు… ఇటు టాలీవుడ్ కోలీవుడ్ నుంచి చాలా మంది హీరోలు రెడీ అవుతున్నారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా చిత్రం సలార్ తెరకెక్కిస్తున్నారు.అయితే తాజాగా టాలీవుడ్
లో మరో టాక్ వినిపిస్తోంది….అల్లు అర్జున్ తో ప్రశాంత్ నీల్ సమావేశం అయ్యారు….అయితే ఈ భేటీ వెనుక స్టోరీ డిస్కషన్
జరిగి ఉండవచ్చు అంటున్నారు… అందుకే ఆయన కలిసి ఉండవచ్చు అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.
తాజాగా హైదరాబాదులోని బన్నీ ఆఫీసులో ప్రశాంత్ నీల్ కనిపించడంతో ఇది పక్కా అని అంటున్నారు అభిమానులు, ఇక బన్నీకి సెట్ అయ్యే ఓ సూపర్ స్టోరీ ఆయనకు చెప్పారు అని వార్తలు వస్తున్నాయి, అయితే దీనిపై ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. సో వచ్చే ఏడాది వరకూ సలార్ షూటింగ్ ఉంటుంది కాబట్టి ఈ చిత్రం వచ్చే ఏడాది మధ్యలో ఉండే అవకాశం ఉంది అంటున్నారు టాలీవుడ్ లో చాలా మంది.
.