తెలంగాణలో కొత్త పార్టీ వస్తోంది, వైయస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటులో బిజీగా ఉన్నారు, అంతేకాదు తెలంగాణలో పలు జిల్లాల నేతలతో ఆమె భేటీ అవుతున్నారు… పలువురు నేతలు వచ్చి ఆమెని కలుస్తున్నారు.. ఇటు తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి నేతలు వచ్చి కలుస్తున్నారు.. వివిధ రంగాల్లోని మేధావులతో చర్చలు జరిపారు. పార్టీ జెండా, అజెండాను రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు.
నిత్యం ఆమెని కలిసేందుకు మాట్లాడేందుకు వైఎస్ అభిమానులు పలు జిల్లాల నుంచి వస్తున్నారు, ఈరోజు ఆమె వరంగల్ జిల్లా వైఎస్ అభిమానులతో సమావేశం అయ్యారు…. వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి..తన తండ్రి పేరు కలిసివచ్చేలా పార్టీ పేరు పెట్టాలి అని చూస్తున్నారు. ఈ వార్తలు అయితే వినిపిస్తున్నాయి…
ఇక పార్టీ ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.. పార్టీ జెండాలో ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు వుంటాయని తెలుస్తోంది. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచి పార్టీలో ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు, ఇక తాజాగా ఖమ్మం నుంచి కూడా ఆమె పోటి చేసే అవకాశం ఉంది అని అక్కడ నేతలు మాట్లాడుకుంటున్నారట…ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆమె తన పార్టీ జెండా ఆవిష్కరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ReplyForward
|