అలనాటి హీరోయిన్లు చాలా మంది తల్లి పాత్రలు అక్క పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఇక సీనియర్ హీరోయిన్లు చాలా మంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.. మంచి మంచి రోల్స్ వస్తే చేయడానికి వెనుకాడటం లేదు, ఇటు ఫ్యామిలీతో ఎంత బిజీగా ఉన్నా తమ ప్రేక్షకులని మెప్పించేందుకు మంచి రోల్స్ అయితే చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు.
ఇక తాజాగా తమకు తగిన వయసు పాత్రలు చేస్తున్న నటీమణులు చాలా మంది ఉన్నారు… ఇక వారిలో సిమ్రన్ కూడా ఒకరు, టాలీవుడ్ లో అందరు టాప్ హీరోలతో ఆమె సినిమాలు చేశారు, గ్లామర్ అనే పదానికి ఆమె కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి.
ఇటీవల రజనీకాంత్ సరసన పేట్ట సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.
ఇక తాజాగా ఆమె మరో సినిమాలో కనిపించనుంది .. హీరో విక్రమ్ సరసన ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న విక్రమ్ 60వ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే ఆయన కుమారుడు ధృవ్ కూడా ఇందులో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె ట్వీట్ ద్వారా తెలిపింది.
ReplyForward
|