స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న భారీ ప్రాజెక్టు ఆది పురుష్. ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు… ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.. తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి..ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా..సైఫ్ అలీఖాన్ లంకేశ్వరుడిగా కనిపిస్తారు.
ఈ సినిమాలో సీత పాత్ర ఎవరు – లక్ష్మణుడి పాత్ర ఎవరని అందరు ఎదురు చూస్తున్నారు, ఎవరి పేరు ప్రకటిస్తారా అని అభిమానులు ఆలోచనలో ఉన్నారు …అయితే తాజాగా లక్ష్మణుడు పాత్ర గురించి బాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది.
యురి సినిమాతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు యువ యాక్టర్ విక్కీకౌశల్.
ఇక ప్రభాస్ సినిమాలో అతని సోదరుడిగా అంటే లక్ష్మణుడిగా ఆయన సెట్ అవుతారు అని చిత్ర యూనిట్ ఆలోచన చేస్తోందట, అందుకే బీ టౌన్ లో ఆయన పేరు వినిపిస్తోంది, అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు, దీనిపై ఎలాంటి లీకులు రాకుండా చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. చాలా వరకూ ముంబైలోనే ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.