మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి, భారీగా కేసులు నమోదు అవడంతో కొన్నిప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిందే అంటున్నారు నిపుణులు, మళ్లీ కొత్త కేసులు పెరగడంతో అందరూ భయబ్రాంతులకి గురి అవుతున్నారు.. కొత్త కేసులు పెరగడంతో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నాగ్ పూర్ లో మార్చి 15 నుంచి 21 వరకు వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించింది.
గతంలో లాక్ డౌన్ ఎలా అమలు చేశారో ఇప్పుడు కూడా అలాగే లాక్ డౌన్ అమలు చేస్తున్నారు, ఇక కేవలం కిరాణా వస్తువులు దొరికే షాపులు… కూరగాయలు పండ్లు షాపులు ఇలాంటివి మెడికల్ షాపులు ఉంటాయి.. మినహా మరే వ్యాపార షాపు తీయరు ఆఫీసులు దుకాణాలు వారం పాటు క్లోజ్ చేయాల్సిందే.
నాగ్ పూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ నిబంధనలు, ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. గత ఏడాది ఇదే సమయంలో ఇక్కడ తొలి కేసు నమోదు అయింది, ఇప్పుడు మళ్లీ ఇదే సమయానికి ఇక్కడ కేసులు పెరగడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో ఒక్క రోజు 13659 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.