బస్సుల్లో టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తే ఏం చేస్తారో మీకు తెలుసుకదా… భారీగా ఫైన్ వేస్తారు ఇది దేశ వ్యాప్తంగా తెలిసిందే, కచ్చితంగా టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలి.. అయితే ఇక్కడ మహిళలు బస్సులో ప్రయాణం చేస్తే టికెట్ తీసుకో అక్కర్లేదు ఆశ్చర్యంగా ఉందా అది ఏమిటో చూద్దాం, మరి ఎక్కడో కూడా తెలుసుకుందాం.
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. రాష్ట్రమంతా ఉచిత ప్రయాణాలకు మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చింది.. మహిళలు రాష్ట్రంలో ఎక్కడకు అయినా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నూతన విధానానికి ముందడుగు వేసింది.
ప్రఖ్యాత ప్రదేశాలు, కట్టడాలు, ఇలా ఏం చూడాలి అని అనుకున్నా వారు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు..పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బడ్జెట్ సందర్భంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక్కడ సర్కారు తీసుకున్న నిర్ణయంతో మహిళలు చాలా ఆనందంలో ఉన్నారు.
ReplyForward
|