శంకర్-రామ్చరణ్ కాంబోలో చిత్రం ప్రకటించిన తర్వాత మెగా అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు.. ఇక ఆర్ ఆర్ ఆర్ గురించి ఆచార్య గురించి ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.. ఈ రెండు సినిమాల తర్వాత చెర్రీ శంకర్ తో సినిమా చేస్తారు.. ఇప్పటికే స్టోరీ ఫినిష్ అయింది…ఇక సినిమాలో నటీ నటుల ఎంపిక కూడా పూర్తి చేస్తున్నారు చిత్ర యూనిట్… అంతేకాదు ఈ సినిమాని చాలా సరికొత్తగా తీయనున్నారు.
ఇక శంకర్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో తెలిసిందే… సౌత్ ఇండియాలో ఆయనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు ఉంది.. సో ఇప్పుడు ఈ సినిమాకి స్వరాలు ఎవరు సమకూరుస్తున్నారు అంటే.. చాలా మంది పేర్లు ఇప్పటి వరకూ వినిపించాయి.. తాజాగా
ఏఆర్ రెహమాన్ నేరుగా తెలుగు మూవీకి స్వరాలు సమకూర్చనున్నారనే టాక్ వినిపిస్తుంది.
మీ నుంచి తెలుగు ఆల్బమ్ ఎప్పుడు వస్తుంది అని సోషల్ మీడియాలో ఓ అభిమాని రెహమాన్ ని ఇటీవల అడిగారు. అందుకు త్వరలోనే అని సమాధానమిచ్చారు రెహమాన్.. సో ఇక చెర్రీ సినిమా అయి ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు… ఇక ఎక్కువగా శంకర్ సినిమాలకు రెహమాన్ బాణీలు ఇస్తారు అనేది తెలిసిందే.. ఇక అభిమానులు కూడా అదే అనుకుంటున్నారు..దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
|
|
శంకర్-రామ్ చరణ్ సినిమాకి మ్యూజిక్ డైరక్టర్ ఎవరు టాలీవుడ్ టాక్ ?
-