రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా కొరియన్ అందాల తార – అలాగే బాలీవుడ్  బ్యూటీ

-

సౌత్ ఇండియాలో అగ్ర దర్శకుడిగా ఉన్న శంకర్ తాజాగా రామ్ చరణ్ తో ఓ సినిమా అనౌన్స్ చేశారు ..ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతోంది.. అయితే సినిమాకి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు చిత్ర యూనిట్… అయితే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ ఎవరు అనేదానిపై టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించింది…అయితే ఈ చిత్రంలో కూడా ఆమె పేరుని పరిశీలిస్తున్నారు అని కోలీవుడ్ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో కొరియన్ అందాల సుందరి సుజీబే కూడా నటిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉంది అని కొందరు అంటున్నారు.. కాదు ఈ ఇద్దరిలో ఒకరు అని మరికొందరు అంటున్నారు..ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా నిర్మించడానికి  సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఎలాంటి ప్రకటనలు వచ్చే అవకాశం లేదు, ఆర్ ఆర్ ఆర్ – ఆచార్య రిలీజ్ అయిన తర్వాత దీనిపై ప్రకటన రావచ్చు అని టాక్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...