ఆదిపురుష్ లో – సీత – లక్ష్మణుడు ఎవరో చెప్పేసిన ప్రభాస్ 

-

పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో కూడా అనేక విషయాలు తన అభిమానులతో పంచుకుంటున్నారు, ఇక ఆయన సినిమాల్లో అందరూ ఆత్రుతగా చూస్తుంది ఆదిపురుష్ కోసం ..ఈ సినిమాలో ఆయన రాముడి పాత్రలో కనిపించనున్నారు, అయితే కొద్ది రోజులుగా సీత లక్ష్మణుడి పాత్ర ఎవరు చేస్తున్నారు అని అభిమానులు ఆలోచన  చేస్తున్నారు.. బీటౌన్ నుంచి చాలా మంది పేర్లు వినిపించాయి..
తాజాగా వారు ఎవరు అనేది ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు సోషల్ మీడియా వేదికగా ..ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ అని పరిచయం చేశారు ప్రభాస్. అంతేకాదు ఆదిపురుష్ కుటుంబంలోకి స్వాగతం అని పేర్కొంటూ ఆమెతో దిగిన ఫొటో పోస్ట్ చేశారు. ఇక లక్ష్మణుడి పాత్రను పోషించే హీరో పేరునూ ప్రభాస్ వెల్లడించారు.  బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ను లక్ష్మణుడి పాత్ర కోసం చిత్ర యూనిట్ తీసుకున్నారు.
మొత్తానికి గత పది రోజులుగా అనేక వార్తలు వినిపించాయి.. దీనిపై ఒక్క ఫోటోతో ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో ఈ చిత్రం తీస్తున్నారు,  ఇక ఈ సినిమాలో మరో ముఖ్యపాత్ర రావణుడి పాత్రఈ రోల్ కోసం  సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...