రెండు రోజులుగా బంగారం ధర భారీగా పెరిగింది.. ఇప్పుడు చూస్తే పుత్తడి ధర భారీగా తగ్గుతూ వస్తోంది.. నేడు పుత్తడి ధరలు తగ్గుముఖం పట్టాయి.. అంతేకాదు వెండి ధర కూడా భారీగా తగ్గింది.. మరి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఓసారి చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గింది. దీంతో రేటు రూ.45,650కు చేరింది.. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 తగ్గుదలతో రూ.41,850కు చేరింది, గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు తగ్గుముఖం పట్టింది.
బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఈరోజు భారీగా తగ్గింది ..కిలో వెండి ఈ రోజు సుమారు 2500 తగ్గింది.
దీంతో రేటు రూ.70,700కు చేరింది, ఏపీలో తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో రేట్లు ఇలాగే ఉన్నాయి… అయితే వచ్చే రోజుల్లో బంగారం మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.
ReplyForward
|