జాతిరత్నాలు హీరోయిన్ కి ఆ హీరో చిత్రంలో అవకాశం టాలీవుడ్ టాక్ 

-

ఈ మధ్య చిన్న సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేస్తున్నాయి, అంతేకాదు భారీగా వసూళ్లు రాబడుతున్నాయి,
సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.. ఇప్పుడు జాతి రత్నాలు సినిమా గురించే టాలీవుడ్ టాక్, ఈ సినిమా సూపర్ హిట్ అయింది, అంతేకాదు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి వసూళ్ల ప్రవాహం పారిస్తోంది. ఇక బయ్యర్లు కూడా చాలా ఆనందంలో ఉన్నారు, ఇక హీరో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలతో పాటు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటనకి అందరూ ఫిదా అవుతున్నారు, అంతేకాదు వీరికి పలు అవకాశాలు వస్తున్నాయి.
చిట్టిగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తెలుగు అభిమానులకి బాగా నచ్చింది, అంతేకాదు ఆమెకి పలు చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయట..తాజాగా  ఫరియా అబ్దుల్లాకి మాస్ మహారాజా సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి..ఖిలాడిమూవీ చేస్తున్న రవితేజ.. తర్వాత త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో చిత్రం చేయనున్నారు, అన్నీ సెట్ అయితే హీరోయిన్ గా చిట్టీ అదే ఫరియా అబ్దుల్లా నటిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి దీనిపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...