అతను ఓ చిన్న కంపెనీలో అకౌంటెంట్ ముంబైలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు, అయితే అబ్బాయి బాగున్నాడు అని ఓ దూరం సంబంధం వారు వచ్చి అతనితో సంబంధం కలుపుకున్నారు, మంధారని ఇచ్చి వివాహం చేశారు, అయితే అతనికి వచ్చే 35 వేల జీతంలో అతను కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు, అయితే ఇప్పుడు పిల్లలు వద్దు.. నీకు శాలరీ పెరిగాక పిల్లల గురించి చూద్దాం అని భర్తని సంసారానికి దూరం పెట్టింది.
సుమారు 8 నెలలుగా ఇలాంటి పనే చేస్తోంది భార్య, ఈకరోనా సమయంలో కంపెనీ జీతాలు పెంచలేదు ఇక సగం జీతం మాత్రమే వచ్చింది, ఈ సమయంలో నువ్వు కంపెనీ అయినా మారు లేదా వేరే ఉద్యోగం చూసుకో అని భార్య సతాయిస్తోంది.. చివరకు నువ్వు నెలకి నాకు లక్ష రూపాయలు సంపాదించి పెట్టాలి.. లేదంటే నీతో కాపురం చేయను అని ఆమె కండిషన్ పెట్టింది..
దీంతో ఏం చేయాలో అతనికి అర్దం కాలేదు…దాదాపు 8 నెలలుగా అతనికి టార్చర్ చూపించింది, ఇక జీవితాంతం ఆమెతో ఉండలేను అని నిర్ణయించుకున్నాడు….చివరకు విడాకుల కోసం అప్లై చేసుకున్నాడు… కుటుంబ సభ్యులకి తన బాధని వివరించి విడాకులకి ముందుకు వచ్చాడు… ఆమె కూడా నీలాంటి వ్యక్తితో ఉండలేను అని విడాకులకి ఒప్పుకుంది.
ReplyForward
|