సిగరెట్ కాల్చే అలవాటు ఉందా.. మీ పక్కన పిల్లలు లేకపోయినా  – వారికి క్యాన్సర్ రావచ్చు – కారణం ఇదే

-

చాలా మంది సిగరెట్ కాల్చేవారు పక్కన ఉన్న వారిని కూడా పట్టించుకోరు…పొగ ఊదుతూ ఉంటారు ..ఇందులో కొందరు రింగులు తిప్పేవారు ఉంటారు… ఇక ఈ వాసన పడక అక్కడ నుంచి పక్కకు జరిగేవారు చాలా మంది ఉంటారు.. అయితే ఇంకొందరు ఇంట్లో పిల్లలు భార్య ఉన్నారు అనేది కూడా పట్టించుకోరు.. ఇలా నలుగురి మధ్య సిగరెట్ కాలుస్తారు, అయితే ఇలా చేసేవారు ఓ విషయం గుర్తు ఉంచుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీ దురలవాటే మీ పిల్లలపాలిట శాపంగా మారే ప్రమాదం ఉంది.ధూమపానం చేసే తండ్రుల పిల్లలు క్యాన్సర్ మహమ్మారి బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ సర్వేలో తేలింది, ఎక్కువగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది
ధూమపానం చేసే వారి వీర్యంలోని డీఎన్ఏ దెబ్బతింటుందని, అలా వారి డీఎన్ ఏ వల్ల వారికి పుట్టబోయే బిడ్డలకు కూడా దీని ప్రభావం చూపిస్తుంది.
మీరు పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటే మాత్రం సిగరెట్లు కాల్చకండి, ఇక ప్లాన్ చేసేమూడు నెలల ముందు ఇలా మానేస్తే మీ డీఎన్ ఏ మెరుగు పడుతుంది అంటున్నారు వైద్యులు..ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందడానికి మూడు నెలల సమయం పడుతుందట.. అందుకే ప్రభావం మారవచ్చు అంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ration Cards | 5.8 కోట్ల రేషన్ కార్డులు రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..

రేషన్ కార్డుల(Ration Cards) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

Exit Polls | వెలువడిన ఎగ్జిట్ పోల్స్.. దూరం పాటించిన కాంగ్రెస్..

Exit Polls | మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్...