తమిళనాడులో ఎన్నికల సందడి మొదలైంది… ఇక రాజకీయ పార్టీలు అన్నీ కూడా మేనిఫెస్టో విడుదల చేస్తున్నాయి, అంతేకాదు అభ్యర్దుల జాబితా కూడా విడుదల చేస్తున్నారు.. మక్కల్ నీది మయమ్ పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ కోయంబత్తూరు సౌత్ నుంచి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు.ఇప్పుడు తమిళనాట అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
తన మొత్తం ఆస్తులు 176.93 కోట్లుగా కమల్ హాసన్ వెల్లడించారు.
ఆయనకు ఉన్న ఆస్తుల్లో స్థిరాస్తులు రూ. 131.84 కోట్లు
చరాస్తులు రూ. 45.09 కోట్లు
అంతేకాదు ఆయనకు లండన్లో రూ. 2.50 కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది.
రూ. 2.7 కోట్ల లెక్సస్ కారు ఉంది
రూ. కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు ఉందని వెల్లడించారు
అంతేకాకుండా రూ. 49.5 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.
2019-20 సంవత్సరానికి పన్ను రాబడి ప్రకారం ఆదాయం రూ .12.1 కోట్లు అని చెప్పారు.
ఇక తనపై ఆధారపడే వారు ఎవరూ లేరు అని తెలిపారు….ఇక కమల్ తన చదువు 8 వ తగరతి అని తెలిపారు… ఇక ఇప్పటి వరకూ నామినేషన్ వేసిన వారిలో కమల్ అత్యంత ధనవంతుడు.
ReplyForward
|