భారత్ లో మళ్లీ కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, ఇప్పుడు దేశంలో సెకండ్ వేవ్ భయాలు నెలకొన్నాయి, ఇక నిన్న ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు, అయితే రోజు 10 నుంచి 15 వేల కేసులు మాత్రమే వచ్చేవి. కాని ఇప్పుడు మళ్లీ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి.. రికవరీ కేసుల కంటే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది…ముఖ్యంగా సగానికి కేసులు ముంబైలోనే నమోదు అవుతున్నాయి.
మన దేశంలో గడిచిన 24 గంటల్లో 35,871 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న కరోనాతో దేశంలో 172 మంది మరణించారు, ఇక నిన్న కరోనా నుంచి 17,741 మంది రికవరీ అయ్యారు. అయితే కేసులు మాత్రం 35 వేలు నమోదు అయ్యాయి.. రికవరీ అయిన వారి కంటే కొత్త కేసులు పెరుగుతున్నాయి.
ముఖ్యంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. ఈ సమయంలో కొత్త కేసులు రావడంతో జనం భయపడిపోతున్నారు, ప్రస్తుతం మన దేశంలో 2,52,364 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక భారీగా కేసులు ఎక్కడ ఉన్నాయి అనేది చూస్తే
గడిచిన 24 గంటల్లో ఒక్క మహారాష్ట్రలోనే 23,179 కేసులు నమోదు అయ్యాయి, తర్వాత
కేరళలో 2098
పంజాబ్ 2013
కర్నాటలో 1275
గుజరాత్ 1122
తమిళనాడులో 945 కేసులు నమోదు అయ్యాయి..
కచ్చితంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.
ReplyForward
|