మంచి యూత్ ఫుల్ సినిమాలతో లవ్ ఓరియెంటెడ్ మూవీస్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు,
అక్కినేని నాగ చైతన్య , తండ్రి నాగార్జున బాటలో ఆయన కూడా బాలీవుడ్ బాట పడుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
అక్కినేని నాగ చైతన్య తండ్రి నాగార్జున వలె తెలుగులో సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలి అని చూస్తున్నారట.
నాగార్జున కూడా బాలీవుడ్ లో తన మార్క్ చూపించారు.. సో ఇప్పుడు ఓ హిందీ చిత్రం చేయడానికి చైతూ సిద్దం అయ్యారు అని వార్తలు వినిపిస్తున్నాయి… మరి ఆ సినిమా ఏమిటి హీరో ఎవరు అంటే, బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ సినిమాలో ఆయన నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమిర్ ఖాన్ హీరోగా లాల్ సింగ్ చద్దా పేరుతో ప్రస్తుతం ఓ హిందీ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇందులో ఓ కీలక రోల్ ఉందట, దీని కోసం ముందు తమిళ నటుడ్ని అనుకున్నారు, కాని ఆయన చేయడం లేదట, తాజాగా నాగ చైతన్యని సంప్రదించారు అని వార్తలు వస్తున్నాయి… సో మరి దీనికి ఆయన ఒకే చెప్పారా లేదా అనేది ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.
ReplyForward
|