ఏపీలో ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే, ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. తాజాగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు వచ్చాయి.
మరి కొత్త మేయర్లు ఎవరు ఎవరికి అవకాశం ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం, అయితే ఈసారి ఒకరు మేయర్ ఉంటే
ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉంటారు. మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్.. ఇద్దరు వైస్ ఛైర్ పర్సన్లు ఉంటారు. సో ఓసారి ఈ లిస్ట్ చూద్దాం.
1.. విజయవాడ మేయర్గా భామన భాగ్యలక్ష్మి
2….విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి.
డిప్యూటీ మేయర్లుగా ముచ్చు నాగలక్ష్మి, కొలగట్ల శ్రావణి
3.. కొత్త పరిపాలన రాజధాని విశాఖ జీవీఎంసీ మేయర్గా గోలగాని హరి వెంకటకుమారి
డిప్యూటీ మేయర్గా జియ్యాని శ్రీధర్
4.. మచిలీపట్నం మేయర్గా మోక వెంకటేశ్వరమ్మ
డిప్యూటీ మేయర్లుగా లంకా సూరిబాబు, తంటేపుడి కవిత
5. గుంటూరు మేయర్ గా మనోహర్ నాయుడు,
డిప్యూటీ మేయర్గా డైమండ్ బాబు.
6.. తిరుపతి మేయర్గా శిరీష
7..ఒంగోలు మేయర్గా గంగాడ సుజాత
డిప్యూటీ మేయర్గా వేమూరి సూర్యనారాయణ.
8…చిత్తూరు మేయర్గా అముద
9..కర్నూలు మేయర్ బి.వై. రామయ్య, డిప్యూటీ మేయర్ ఎస్.రేణుక.
10.. అనంతపురం మేయర్గా వసీమ్ సలీమ్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా వాసంతి సాహిత్య.
11.. కడప మేయర్గా సురేష్ బాబు