ఒక్కోసారి రైళ్లు వెనక్కి వెళ్లడం చూసే ఉంటాం.. అయితే మహా అయితే ఓ అర కిలోమీటర్ లేదా కిలో మీటర్ వెళతాయి.. సాంకేతిక సమస్య క్లియర్ అయ్యాక మళ్లీ ముందుకు వస్తాయి.. ఇక ఇప్పుడు ఓ రైలు మాత్రం ఏకంగా సాంకేతిక లోపం కారణంగా 35 కిలోమీటర్ల దూరం రివర్స్‌లో వెళ్లింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు, మరి ఘటన ఎక్కడ జరిగింది అనేది చూస్తే.
ఢిల్లీ నుంచి బయలుదేరిన పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఉత్తరాఖండ్‌లోని తనక్‌పూర్ జిల్లా మీదుగా వెళ్తున్న సమయంలో ట్రాక్‌పైకి పశువులు రావడాన్ని గుర్తించాడు లోకో పైలట్… దీంతో వెంటనే సడెన్ బ్రేక్ వేశాడు… ఇక ఇంజిన్ లో సాంకేతిక సమస్య వచ్చింది.. వెంటనే వెనక్కి రైలు వెళ్లింది.
అలాగే 35 కిలోమీటర్లు వెళ్లి ఖాతిమా దగ్గర నిలిచిపోయింది ఈ రైలు… ఈ సమయంలో ట్రైన్ పై నియంత్రణ లేకుండాపోయింది, అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.. అక్కడ క్రాసింగ్ లు కూడా క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది రైల్వే గేటులవి..ఆ రైలు నడిపిన లోకోపైలట్, గార్డ్‌లపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ వీడియో చూడండి.
ReplyForward
|