మన దేశంలో నిత్యం కొన్ని వేల ట్రైన్స్ పట్టాలపై పరుగులు పెడతాయి.. కోట్లాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు, అయితే మనం ట్రైన్ కూడా చాలా సార్లు ఎక్కుతాం, కాని ఎప్పుడైనా మీరు ఇది ఆలోచించారా, అసలు ట్రైన్ ఒక్క నిమిషం ఆలస్యం అయితే ఎంతనష్టం ఉంటుంది అనేది…సో కచ్చితంగా ట్రైన్ జర్నీ చేసేవారికి ఇది చాలా సార్లు డౌటానుమానంగా వచ్చే ఉంటుంది కొంత మంది నిపుణులు చెప్పేదాని ప్రకారం అసలు ట్రైన్ ఆలస్యం అయినా లేదా ఏదైనా ఇబ్బంది వచ్చి ఆగినా ఏం జరుగుతుంది
ఎంత లాస్ అంటే.
కదిలే ట్రైన్ ఎలాంటి కారణం లేకుండా ఆగాల్సి వస్తే.. ఇండియన్ రైల్వేస్కు భారీ నష్టం సంభవిస్తుంది. మనకు డిజీల్ ఇంజిన్ తో నడిచే ట్రైన్స్ ఉన్నాయి, అలాగే కరెంట్ తో నడిచే ట్రైన్లు ఉన్నాయి,..డీజిల్ ఇంజిన్తో నడిచే ట్రైన్ ఒక్క నిమిషం ఆగితే.. రూ.20,401 నష్టం వస్తుంది. అదే ఎలక్ట్రిక్ ట్రైన్ అయితే రూ.20,459 నష్టం వాటిల్లుతుంది. నిజంగా ఎంత లాస్ అనేది చూశారా.
ఇక గూడ్స్ ట్రైన్స్ కూడా చూసుకుంటే, డీజిల్ ట్రైన్ ఒక నిమిషం ఆగితే రూ.13,334, ఎలక్ట్రిక్ ట్రైన్ అయితే రూ.13,392 నష్టం వస్తుంది. ఇక్కడ మరో విషయం ఇలా ట్రైన్ సడెన్ గా ఆగితే, మళ్లీ అంతే వేగం పుంజుకోవాలి అంటే కచ్చితంగా మూడు నిమిషాల సమయం పడుతుంది, దీని కోసం డీజీల్ పవర్ చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది, అందుకే ఇంజిన్ ఎక్కువగా ఆపరు.
ఇక ట్రైన్ నిలిచిపోయింది అంటే ఆ రూట్లో వెళ్లే ట్రైన్స్ కూడా నిలిచిపోతాయి, దీంతో మరింత నష్టం ఏర్పడుతుంది.
ReplyForward
|