మీ దగ్గర పాత వెహకల్ ఉందా – ఈ చార్జీలు భారీగా పెరిగాయి తప్పక తెలుసుకోండి

-

ఇది మీరు కచ్చితంగా తెలుసుకోండి, మీ దగ్గర దాదాపు 15 సంవత్సరాల పై బడిన వాహనం ఉందా, అయితే మీరు ఈ విషయం తెలుసుకోండి, ఎందుకు అంటే ఇక ఇలాంటి వాహనాల విషయంలో కేంద్రం  ఆర్సీ రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక మీరు ఇలాంటి వెహికల్స్ రెన్యువల్ కు వస్తే కచ్చితంగా మీరు 5000 చెల్లించాలి అంతేకాదు.
దీనికి ఇప్పుడు అమలులో ఉన్న ఫీజుకి 8 శాతం అదనంగా తీసుకుంటారు…ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్లో ఆలస్యం చేస్తే, నెలకు రూ .300 నుండి 500 రూపాయల జరిమానా వసూలు చేయనుంది. ఇక జరిమానాలు మాములుగా ఉండవు, ఇక కమర్షియల్ వెహికల్స్ కి ఫిట్ నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ లేట్ చేస్తే రోజువారీగా రూ .50 జరిమానా విధించనుంది.
15 ఏళ్ల కంటే పాత ద్విచక్ర వాహనాల ఆర్సీ రెన్యువల్ ఫీజును రూ.300 నుంచి రూ .1000కి పెంచనుంది. ఇక ట్రక్కులు బస్సులు అయితే దాదాపు 12500 చెల్లించాలి..దాదాపు 21 రెట్లు పెరిగింది.2021 అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి..పాత వాహనాల సంఖ్యను తగ్గించేందుకే కేంద్రం ఇలాంటి కొత్త రూల్స్ తీసుకువస్తోంది అంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...